శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:00 IST)

'జీఎస్టీ'లో కాదుకానీ.. 'జీటీ-2'లో నటిస్తానంటున్న యాంకర్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ మూవీ "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" (జీఎస్టీ). ఈ మూవీలో మియా మాల్కోవా ప్రధాన పాత్రధారిగా నటించింది. గత నెల 25వ తేదీన విడుదలైన ఈ వెబ్ మూవీపై ప్రస్తుతం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ మూవీ "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" (జీఎస్టీ). ఈ మూవీలో మియా మాల్కోవా ప్రధాన పాత్రధారిగా నటించింది. గత నెల 25వ తేదీన విడుదలైన ఈ వెబ్ మూవీపై ప్రస్తుతం నిషేధం విధించివున్నారు. మరోవైపు, 'జీఎస్టీ-2'ను తీయనున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
 
ఈనేపథ్యంలో ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీతో నెటిజన్లు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్... "జీఎస్టీ-2"లో నటించేందుకు ఆర్జీవి ఛాన్స్ ఇస్తే నటించేందుకు సిద్ధమా అని ప్రశ్నిస్తే రష్మీ చాలా తెలివిగా సమాధానం చెప్పింది.
 
దీనికి సమాధానంగా రష్మి 'జీఎస్టీ-2'లో కాదుకానీ, 'జీటీ-2'(గుంటూరు టాకీస్-2)లో నటించేందుకు సిద్ధం... కానీ అది కూడా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తేనే' అంటూ సమాధానమిచ్చింది.