మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (12:30 IST)

హీరోయిన్ అనేది ఖరీదైన ఉద్యోగం.. సంపాదనకు తగ్గట్టే..?: రాధికా ఆప్టే

అందాలను ఆరబోస్తూ.. నటనతో ఆకట్టుకునే లెజెండ్ నాయిక రాధికా ఆప్టే.. హీరోయిన్ల జీతాలపై నోరెత్తింది. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన ప్యాడ్ మ్యాన్‌లో నటించిన రాధికా ఆప్టే.. హీరోయిన్లకు సంపాదనకు తగినట్లే ఖర్

అందాలను ఆరబోస్తూ.. నటనతో ఆకట్టుకునే లెజెండ్ నాయిక రాధికా ఆప్టే.. హీరోయిన్ల జీతాలపై నోరెత్తింది. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన ప్యాడ్ మ్యాన్‌లో నటించిన రాధికా ఆప్టే.. హీరోయిన్లకు సంపాదనకు తగినట్లే ఖర్చు వుంటుందని కబాలీ కథానాయిక తెలిపింది.

అందాన్ని కాపాడుకునేందుకు, దుస్తులు కొనుగోలు చేసేందుకు.. చక్కని శరీరాకృతిని పొందేందుకు అధికమొత్తంలో ఖర్చవుతుందని రాధికా ఆప్టే వెల్లడించింది. ఇక పార్టీలకు, డిన్నర్లకు బాగా ఖర్చు పెట్టాల్సి వుంటుందని రాధికా ఆప్టే తెలిపింది. 
 
హీరోయిన్ అనేది ఓ ఖరీదైన ఉద్యోగమని వెల్లడించింది. గత ఏడాది సినిమా షూటింగ్‌లతో బిజీగా వున్నానని.. ఆ సినిమాలన్నీ ఈ ఏడాది విడుదలవుతాయని చెప్పింది. కాస్త విరామం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానని రాధికా ఆప్టే వెల్లడించింది. 
 
ఇక అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. టైటిల్ రోల్‌కు అక్షయ్ న్యాయం చేశారని చెప్పింది. ఆయనొక్కరే ఆ పాత్రకు తగిన న్యాయం చేయగలరని రాధికా ఆప్టే కొనియాడింది.