శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (13:26 IST)

నేను హీరోయిన్‌ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పాపనాయకన్‌ పాళయం ధనలక్ష్మినగర్‌కు చెందిన శ్రుతి (21) అనే యువతి తమిళ చిత్ర పరిశ్రమంలో ఒకటిరెండు చిత్రాల్లో నటించి సినీ నటిగా ఉంది. ఈమె పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి విదేశాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, యువకుల వద్ద లక్షల్లో వసూలు చేసి ఉడాయించింది. 
 
ఇలాంటివారిలో సేలం జిల్లా ఎడప్పాడికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బాలమురుగన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శృతి బండారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. 
 
శ్రుతితోపాటు ఆమె తల్లి చిత్ర, పెంపుడు తండ్రి ప్రసన్న వెంకటేశ్‌, తమ్ముడు సుభాష్‌ను కూడా అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆమె వద్ద జరిపిన విచారణలో అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసగించి రూ.కోట్లు గడించినట్లు తెలిసింది.