బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (12:26 IST)

అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తే అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తామంటూ హెచ్చరిక చేసింది. అంతేనా తక్షణం నిత్యానంద అనుచరుడిని తక్షణం అరెస్టు చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
నిత్యానంద స్వామి బారి నుంచి మధురై మఠాన్ని రక్షించాలని, ఆయనపై చర్యలు తీసుకొనేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని జలతాల ప్రతాపన్ అనేవ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. 
 
ఈ కేసులో సెల్‌ఫోన్ ద్వారా వాదనల సమాచారం తెలియజేస్తున్న నిత్యానంద అనుచరుడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే, నిత్యానంద అడ్డగోలుగా మాట్లాడుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో నిత్యానందపై అరెస్టు వారెంట్ జారీచేస్తామని జస్టిస్ ఆర్.మహదేవన్ హెచ్చరిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.