శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (10:55 IST)

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 498/ఏ సెక్షన్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 498/ఏ సెక్షన్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సినీ నటుడు సామ్రాట్ రెడ్డికి భార్య స్వాతిరెడ్డిలకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో గత కొన్ని నెలలుగా విభేదాలు పొడచూపాయి. ఈనేపథ్యంలో తన ఇంట్లో బంగారం దొంగతనం చేయడమే కాకుండా తనను వేధిస్తున్నాడంటూ భార్య స్వాతిరెడ్డి ఫిర్యాదు చేసింది. దీంతో వారి విభేదాలు రచ్చకెక్కాయి. 
 
ఈ వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేసి సామ్రాట్ రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే, అతని సోదరి సాహితీరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, సామ్రాట్ రెడ్డి 'పంచాక్షరి', 'తకిట తకిట', 'బావా', 'దేనికైనా రెఢీ' వంటి పలు చిత్రాల్లో నటించాడు.