గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (11:05 IST)

అక్రమంగా డాలర్ల రవాణా ... జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. రూ.3.21 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను అక్రమంగా తరలించిందన్న అభియోగంపై అదుపులోకి తీసుకున్నారు. 
 
హాంగ్‌కాంగ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విమానంలో ఓ మహిళా విమాన సిబ్బంది నుంచి రూ.3.21 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డాలర్లను సరఫరా చేసిన వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అమిత్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరి వద్ద డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.