బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (17:19 IST)

త్రిష గూఢచారి.. బాలా శిష్యుడితో..

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా నుంచి తప్పుకుని వివాదాన్ని కొనితెచ్చుకున్న త్రిష.. దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మోహిని

చెన్నై చిన్నది త్రిష మూడు పదులు దాటినా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇటీవల సామి-2 సినిమా నుంచి తప్పుకుని వివాదాన్ని కొనితెచ్చుకున్న త్రిష.. దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మోహిని, గర్జనై, సదురంగవేట్టై-2, 1818, 96 వంటి సినిమాలతో బిజీబిజీగా గడిపిన త్రిష తాజాగా బాలా శిష్యుడు వర్నిక్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
నటి సురభి కీలక పాత్రలో కనిపించే ఈ సినిమాకు ''కుట్రపయిర్చి'' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. 1980లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష గూఢచారిగా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇకపోతే.. అరవింద్ స్వామికి జోడీగా నటించిన సదురంగవేట్టై-2 ఫిబ్రవరి మూడో వారంలో విడుదల కానుంది.