ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (09:02 IST)

అతనితో నటి సహజీవనం.. విభేదాల రాగానే వేధింపులంటూ ఫిర్యాదు...

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను పారిశ్రామికవేత్త అమర్ ఖన్నా లైంగికంగా వేధిస్తున్నారంటూ పేర్కొంది. ఈ మేరకు ముంబై జుహూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను పారిశ్రామికవేత్త అమర్ ఖన్నా లైంగికంగా వేధిస్తున్నారంటూ పేర్కొంది. ఈ మేరకు ముంబై జుహూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. 304డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదు చేసిన పారిశ్రామికవేత్తతో జీనత్ అమన్ కొన్ని నెలలుగా సహజీవనం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో పారిశ్రామికవేత్త లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిందనీ పోలీసులే చెపుతున్నారు. మొత్తంమీద వెటర్న్ నటిగా ఉన్న జీనత్ అమన్ చేసిన ఫిర్యాదు ఇపుడు చర్చనీయాంశంగా మారింది.