శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (17:59 IST)

బాలికలను లైంగికంగా వేధించిన కోచ్‌కు 105 సంవత్సరాల జైలు.. ఎక్కడ?

దేశంలో వావివరుసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. నిందితులపై ఐదేళ్లు, పదేళ్లు జైలు శిక్ష పడుతోంది. అయితే అమెరికాలో చిన్నారులను లైంగికంగా వేధించిన ఓ కోచ్‌కు ఏకంగా 105 సంవత్

దేశంలో వావివరుసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. నిందితులపై ఐదేళ్లు, పదేళ్లు జైలు శిక్ష పడుతోంది. అయితే అమెరికాలో చిన్నారులను లైంగికంగా వేధించిన ఓ కోచ్‌కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దేశంలో కఠినమైన చట్టాలు వుంటేనే మహిళలపై అఘాయిత్యాలు జరగవని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. అమెరికాలో మాత్రం 105 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ లాస్‌ఏంజిల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన రోన్నీ లీ రోమన్ స్కూలులో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి చిన్నారులకు కోచింగ్ ఇస్తోన్న స‌మ‌యంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సులో గల బాలికలను వేధించేవాడు. దీంతో అతడిపై 2014లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు దర్యాప్తులో అతడు బాలికలను వేధించడం నిజమని తేలడంతో 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.