ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (13:32 IST)

దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు.

పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుందని కేసీఆర్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అధికార దాహంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని.. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేటీఆర్‌కు చాలా విషయాల్లో అవగాహన లేదని.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు.