మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 10 మార్చి 2018 (15:10 IST)

ట్యాంక్ బండ్ క్లోజ్... మిలియన్ మార్చ్ దడ... కోదండరాం కామెంట్స్

ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వక పోవటం నిరంకుశ పాలనకు నిదర్శనం అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. ప్రజలు ఉవ్వెత్తున తరలి వచ్చి విజయవంతం చే

ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వక పోవటం నిరంకుశ పాలనకు నిదర్శనం అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. ప్రజలు ఉవ్వెత్తున తరలి వచ్చి విజయవంతం చేసారు. ఆనాడు 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నాం.
 
ప్రస్తుతం తెలంగాణాలో సమస్యలు చాలా ఉన్నాయ్. నిరుద్యోగం, రైతు సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. మిలియన్ మార్చ్ స్పూర్తి సభను ఇంతకాలం ప్రభుత్వం నిర్వహిస్తుందేమో అని ఎదురు చూశాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలు ఉంటాయనుకోలేదు. మాతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ, CPI, న్యూడెమోక్రసి. TPF, అరుణోదయ సంస్థ, విద్యాసంఘాలు స్పూర్తి సభకు తరలి వస్తున్నారు.
 
ఇప్పటికే వేలాదిగా ఇప్పటి మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అన్ని వర్గాలు హైదరాబాద్ తరలి వస్తున్నారు. జిల్లాల్లో హైదరాబాద్‌లో ఎన్ని అక్రమ అరెస్టు చేసిన నిర్బంధాలు ఉన్నా స్పూర్తి సభ విజయవంతం అవుతుందనే నమ్మకం నాకుందని అన్నారు. ఐతే ట్యాంక్ బండ్ క్లోజ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్ రహదారిపై హోర్డింగులను పెట్టించింది.