శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (06:06 IST)

'ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?'.. తెరాస ఎమ్మెల్యేలకు ప్రశ్న

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్య

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘జయజశంకర్‌ సార్‌ స్ఫూర్తి- ఉద్యమ ఆకాంక్షలు - వాస్తవ పరిస్థితులు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో కోదండరాం పాల్గొని ప్రసంగించారు.
 
ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... ఓట్ల కోసం వచ్చే ఎమ్మెల్యేలను, ‘ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?’ అని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తనతో ఆనాడే చెప్పారన్నారు. 
 
ఆయన ఆశయ సాధన కోసమే తాము మరో పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. ఇక రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకుండా ఆంక్షల పేరిట అడ్డంకులు సృష్టిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాజ్యాంగం అందరికీ మాట్లాడే హక్కు కల్పించిందని, ఆ హక్కును సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని అన్నారు.