శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By TJ
Last Modified: శుక్రవారం, 16 జూన్ 2017 (16:36 IST)

కోదండరామస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ(వీడియో)

తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవోపేతంగా జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సంప్రోక్షణ ఘట్టానికి అశేష భక్తజనం తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కలశాలకు మహాసంప్రోక్షణ నిర్వహ

తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవోపేతంగా జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సంప్రోక్షణ ఘట్టానికి అశేష భక్తజనం తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కలశాలకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. అందులో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అష్టబంధన మహాసంప్రోక్షణ ముగిసింది. టిటిడి ఈవోతో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.