మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (16:43 IST)

నా దేవత బయోపిక్ తీయను.. అలా ఎవరూ నటించలేరు : రాంగోపాల్ వర్మ

భారతీయ చిత్ర సీమలో ఇపుడు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. దీంతో అనేక మంది దర్శకులు పలువురు ఆదర్శమూర్తుల జీవితాలను కథాంశంగా తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

భారతీయ చిత్ర సీమలో ఇపుడు బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. దీంతో అనేక మంది దర్శకులు పలువురు ఆదర్శమూర్తుల జీవితాలను కథాంశంగా తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తీస్తున్నారు. 
 
అయితే, ఇటీవల హఠాన్మరణం చెందిన సినీ నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆధారంగా ఆర్జీవి బయోపిక్ తీయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై ఆయన స్పందించారు. 'నేను శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నానంటూ ఓ వ‌ర్గం మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజం కావు. అస‌లు ఆ ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా న‌టించ‌గ‌ల న‌టి ఒక్క‌రు కూడా లేర‌ు' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, శ్రీదేవికి వీరాభిమాని అయిన రాంగోపాల్ వర్మ.. ఆమె మరణవార్త తెలియగానే ఒకింత షాక్‌కు గురైన విషయం తెల్సిందే. శ్రీదేవి గురించి, ఆమెతో త‌న అనుబంధం గురించి వ‌రుస ట్వీట్లు చేశారు. శ్రీదేవి నా ఆరాధ్య దేవత అని కూడా వ్యాఖ్యానించారు. అలాగే, దుబాయ్‌లో ఆమె అనుమానాస్ప‌దంగా మృతి చెందడాన్ని కూడా ప్రశ్నించారు.