శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (12:08 IST)

రజనీకాంత్ సరసన నయనతార?: అంజలి, త్రిషను పక్కనబెట్టేసిన టీమ్?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కాలా సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. మరోవైపు రోబో సీక్వెల్‌లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కాలా సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. మరోవైపు రోబో సీక్వెల్‌లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రజనీకాంత్ ఒక భారీ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. 
 
రజనీకాంత్ సరసన నటించేందుకు దీపికా పదుకునే, త్రిష, అంజలి పేర్లను పరిశీలించారు. దీపిక బిజీ కావడంతో ఆమె రజనీ సరసన నటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక త్రిషను కూడా తీసుకోరని తెలుస్తోంది. అలాగే అంజలి కూడా సెట్ కాకపోవచ్చునని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర యూనిట్ నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్‌లో క్రేజ్ వుంది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్‌గా రజనీ సరసన సెట్ అవుతుందని.. ఇప్పటికే రజనీకాంత్ సరసన రెండు సినిమాల్లో నయనతార నటించింది. దీంతో సూపర్ స్టార్ సరసన నయనతార నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.