మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 29 జులై 2025 (13:11 IST)

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

Crime
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అత్తాపూర్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, మాట్లాడుకుందామని చెప్పి లాడ్జికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని ఉమ్నాబాద్ ప్రాంతానికి చెందిన వీరయ్య ఇటీవలే హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో తమ బంధువు పెళ్లి వేడుకకి హాజరయ్యాడు. ఆ వివాహ వేడుకలో అతడు ఓ యువతిపై కన్నేసాడు.
 
మెల్లగా ఆమెతో మాటలు కలిపి ప్రేమిస్తున్నాననీ, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెతో ఫోనులో తరచూ సంభాషించడం ప్రారంభించాడు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ వచ్చి యుతికి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచాడు. అలా ఆమెను ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు.
 
జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఐతే అప్పట్నుంచి యువతి ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా నిలదీశారు. దీనితో విషయాన్ని చెప్పేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.