ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (11:41 IST)

త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ కసరత్తులు.. రణ్ వీర్ సింగ్ ఏమన్నాడంటే..? (ఫోటో)

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. స్లిమ్ అండ్ ట్రిమ

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారేందుకు కసరత్తులు మొదలెట్టాడు. ఇందుకోసం ఎప్పుడెప్పుడు తెల్లవారుంతా.. జిమ్‌కు పరుగులు తీద్దామా అని ఎదురుచూస్తున్నాడు. 
 
త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్‌గా కనిపించాలట. ఇందుకోసం త్రివిక్రమ్ చెప్పినట్లు ఎన్టీఆర్ వర్కౌట్లు చేస్తున్నాడు. ఇందుకోసం ఎన్టీఆర్ తన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సూచనలతో ఎన్టీఆర్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఎన్టీఆర్ ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ ఫోటోపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు కండలు తిరిగిన ఎన్టీఆర్‌ తీవ్రంగా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోను లాయిడ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోపై ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ కామెంట్‌ చేశారు. బీస్ట్‌ఇన్‌ అని రణ్‌వీర్‌ కామెంట్‌ చేయగా.. మీకు తెలుసు బ్రదర్‌ అంటూ లాయిడ్‌ బదులు ఇచ్చారు.