సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (12:56 IST)

రణ్‌వీర్ సింగ్ సరసన.. ప్రియా వారియర్.. బాలీవుడ్ షేక్ షేక్..

సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ కుట్టి ప్రియా వారియర్‌ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. వెరైటీగా కన్నుగీటి ఓవర్ నైట్‌లో సూపర్ స్టార్‌గా మారిన ప్రియా వారియర్‌కు తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు

సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ కుట్టి ప్రియా వారియర్‌ సూపర్ ఛాన్స్ కొట్టేసింది. వెరైటీగా కన్నుగీటి ఓవర్ నైట్‌లో సూపర్ స్టార్‌గా మారిన ప్రియా వారియర్‌కు తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు బాలీవుడ్‌లో టాక్ వస్తోంది. ప్రియా వారియర్ ఏకంగా.. హిందీలో రణ్ వీర్ సింగ్ సరసన నటించబోతోందని టాక్ వస్తోంది. 
 
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నథాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ''టెంపర్'' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ హీరో కాగా, ఆయన సరసన ప్రియా వారియర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రణ్ వీర్ సింగ్ సరసన అలియా భట్, శ్రద్ధా కపూర్ పేర్లు వినిపించినా.. సినిమా యూనిట్ మాత్రం చివరకు ప్రియా వారియర్‌ను ఖరారు చేసినట్లు బిటౌన్ వర్గాల్లో టాక్. 
 
ఇక ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు. ఈ ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ప్రియా వారియర్ సూపర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రూపుదిద్దుకున్న ''ఒరు ఆదార్ లవ్'' జూన్‌లో రిలీజ్ కానుంది. ఇక టాలీవుడ్‌లోనూ ప్రియా వారియర్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రియాతో నటించేందుకు యంగ్ హీరోలు పోటీపడుతున్నారని సమాచారం. తాజాగా ప్రియకు దొరికిన అవకాశం ద్వారా బాలీవుడ్‌ను షేక్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు చెప్తున్నారు.