మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (16:01 IST)

కన్నుకొట్టిన ప్రియా... నవ్వుకున్న సుప్రీం జడ్జీలు

మలయాళ కుట్టిన ప్రియా వారియర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' చిత్రంలోని "మాణిక్య మలరాయ పూవీ" అనే పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు దేశ యువత ఫిదా అయిపోయింది.

మలయాళ కుట్టిన ప్రియా వారియర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' చిత్రంలోని "మాణిక్య మలరాయ పూవీ" అనే పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు దేశ యువత ఫిదా అయిపోయింది. ఈ కారణంగా ప్రియా వారియర్ పేరు దేశంలో మార్మోగిపోయింది. 
 
అయితే, ఆ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రదర్శించిన హావభావాలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ కొన్ని ముస్లిం సంఘాలు కోర్టుకెక్కాయి. ఈ కేసు విచారణకి స్వీకరించిన సుప్రింకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తంచేసింది. అయితే, కేసు విచారణ సమయంలో న్యాయ‌మూర్తుల బృందం నవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రియా లాయర్ హరీష్ బీరన్ కేసు వివరాలు వినిపిస్తుండగా, బెంచ్‌కి సంబంధించిన ముగ్గురు న్యాయ‌మూర్తులు జస్టీస్ దీపక్ మిశ్రా, జస్టీస్ ఏఎన్ కాన్‌విల్కర్, జస్టీస్ చంద్రచూడ్‌లు చిరునవ్వులు చిందించారు. తర్వాతి రోజు కూడా ఇదే కేసుపై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లాయర్‌ని ప్రశ్నించారు. ఆ సాంగ్ లిరిక్స్ ఏమన్నా ప్రియా రాసిందా? ఈ కేసు విషయంలో పిటీషనర్ హైకోర్టుని ఎందుకు ఆశ్రయించలేదు అంటూ ప్రశ్నించగా, లాయర్ చిన్నపాటి వివరణ ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ముగ్గురు జడ్జీలు కేసుకి సంబంధించి డిస్కస్ చేసుకుంటూ నవ్వుకున్నారు. ఒకానొక సందర్భంలో జస్టిస్ చంద్రచుడ్ బిగ్గరగా నవ్వడంతో కేసు విచారణ సయయంలో జడ్జిల ప్రవర్తన హాలులో ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరిగా దీపక్ మిశ్రా ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్‌తో నటి ప్రియాంక, దర్శకుడు రిలీఫ్ అయ్యారు.