శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 22 ఫిబ్రవరి 2018 (18:34 IST)

ఢిల్లీలో 'చెన్నై' దీపక్... యువతి దుస్తులు మార్చుకుంటుండగా వీడియో షూట్...

ఢిల్లీలో జార్ఖండ్ కు చెందిన ఓ విద్యార్థినికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమె స్నానాల గదిలో దుస్తులు మార్చుకుంటుండగా ఓ యువకుడు ఆమెను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన ఆమె కేకలు వేయడంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 140 మంది విద్యార్థినీవిద్యార్థులు ఢిల్లీ లోని కృతి నగర్ ప్రాంతంలో ఓ హోటల్లో దిగారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని స్నానాల గదిలో దుస్తులు మార్చుకుంటోంది. ఐతే ఆమె దుస్తులు మార్చుకుంటూ వుండటాన్ని తన ఫోన్ ద్వారా వీడియో తీసేందుకు చెన్నైకు చెందిన దీపక్ అనే యువకుడు ప్రయత్నించాడు. అతడు ఫోన్ ఫ్లాష్ లైట్ వుపయోగించడంతో విద్యార్థిని పసిగట్టి గట్టిగా కేకలు వేసింది. దీనితో తోటి విద్యార్థులు అప్రమత్తమై సదరు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.