బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (16:48 IST)

ప్రియా ప్రకాష్ వారియర్.. తెలుగులో సినిమాలో నటించనుందా?

కన్నుగీటి సోషల్ మీడియాలో పుణ్యంతో సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్.. తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మలయాళంలో ''ఒరు ఆదార్ లవ్'' సినిమాతో వెండ

కన్నుగీటి సోషల్ మీడియాలో పుణ్యంతో సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్.. తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మలయాళంలో ''ఒరు ఆదార్ లవ్'' సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ చిత్రంలోని 'మాణిక్య మలరాయ పూవై' పాటలో ప్రదర్శించిన హావభావాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
 
ఈ హావభావాలే అమ్మడుకు బోలెడు సినిమా ఛాన్సులను వెతుక్కుంటూ వచ్చేలా చేశాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీయబోయే తదుపరి సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని.. ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రియా వారియర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.