బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:31 IST)

కీర్తి సురేష్.. దానికి అంత టైమ్ తీసుకుంటుందా?

కీర్తి సురేష్.. ఈ పేరు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఇప్పటికే ''మహానటి''లో నటిస్తున్న కీర్తి సురేష్.. దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రస్తుతం మంచి గుర్తింపు

కీర్తి సురేష్.. ఈ పేరు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఇప్పటికే ''మహానటి''లో నటిస్తున్న కీర్తి సురేష్.. దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రస్తుతం మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్.. మహానటిలో అలనాటి తార సావిత్రిగా కనిపించనుంది.  ఈ నేపథ్యంలో కీర్తి సురేష్.. నిర్మాతలకు, తోటి హీరోలను ఇబ్బంది పెట్టే పనిచేస్తుందట.
 
కీర్తి సురేష్‌కు వున్న అలవాటే వారి అసహనానికి కారణమట. ఇంతకీ కీర్తి సురేష్ అలవాటేంటంటే? సెట్స్‌కి సమయానికే వచ్చేసే కీర్తి సురేష్ మేకప్ కోసం చాలా సమయం తీసుకుంటుందట. దాదాపు రెండు గంటల పాటు ఆమె మేకప్ వేసుకుంటుందట.
 
స్పెషల్ పాత్రల కోసమే కాకుండా మామూలు పాత్రలకు కూడా గంటల సమయం కేటాయిస్తుందట. ఇలా గంటల కొద్దీ కీర్తి సురేష్ మేకప్ కోసం సమయం వృధా చేస్తుంటే.. దర్శకనిర్మాతలు ఇబ్బంది పడుతున్నారట. తోటి హీరోలైతే ఇదేంటబ్బా అంటూ తలపట్టుకుంటున్నారట.