సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 7 ఏప్రియల్ 2018 (21:33 IST)

హీరో నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి...ఏంటవి...?(Video)

శ్రీరెడ్డి ప్రతిరోజు తన మాటల దాడిని కొనసాగిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతూ రోజుకో దుమారం రేపుతోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజిలో నేచురల్ స్టార్ నానిపై విమర్శలు చేస్తూ శ్రీరెడ్డి పోస్టులు చేసింది. ఇదే విషయంపై తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చే జరుగుతోంది

శ్రీరెడ్డి ప్రతిరోజు తన మాటల దాడిని కొనసాగిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతూ రోజుకో దుమారం రేపుతోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజిలో నేచురల్ స్టార్ నానిపై విమర్శలు చేస్తూ శ్రీరెడ్డి పోస్టులు చేసింది. ఇదే విషయంపై తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చే జరుగుతోంది. నానికి ఎలాంటి క్లీన్ ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిపైన శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
నాని అమ్మాయిలను వాడుకొని వదిలేస్తాడు. సినీ పరిశ్రమకు ఎంటర్ అయినప్పటి నుంచి నానికి ఇదే అలవాటు. ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలతో నాని కలిసి తిరిగాడు. ఇది నాకు బాగా తెలుసు. నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎప్పుడూ సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుపోయే నానిపైన శ్రీరెడ్డి విమర్శలు చేయడం ఏమిటా అని అనుకుంటున్నారు నాని అభిమానులు. మరి ఈ విషయంపై నాని ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
 
ఇదిలావుంటే ఈరోజు శ్రీరెడ్డి తెలుగు ఫిలిం చాంబర్ ఎదుట దుస్తులు విడిచి అర్థనగ్న ప్రదర్శన చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందంటూ నినాదాలు చేసింది. చూడండి వీడియోను...