శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 4 ఏప్రియల్ 2018 (18:50 IST)

అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం స్త్రీ అని గుర్తుపెట్టుకోండి.. కాజల్ అగర్వాల్

తెలుగు సినీపరిశ్రమలో ఎదగాలంటే డైరెక్టర్లతో పడక పంచుకోవాల్సిందే అంటూ ఈమధ్య కొంతమంది నటీమణులు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సైడ్ ఆర్టిస్టులు ఇది కరెక్టేనంటూ వంత పాడారు. మరికొంతమంది మాత్రం ఖండిస్తూ వచ్చారు. అగ్ర నటీమణు

తెలుగు సినీపరిశ్రమలో ఎదగాలంటే డైరెక్టర్లతో పడక పంచుకోవాల్సిందే అంటూ ఈమధ్య కొంతమంది నటీమణులు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సైడ్ ఆర్టిస్టులు ఇది కరెక్టేనంటూ వంత పాడారు. మరికొంతమంది మాత్రం ఖండిస్తూ వచ్చారు. అగ్ర నటీమణులలో కొందరు ఇదేవిధంగా స్పందించారు. తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
మనం ఒక రంగంలో ఉన్నాం.. ఆ రంగంలో ఎదగాలనుకోవాలి. అంతేగాని నోటికి ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదు. ఒకరి గురించి చెప్పినప్పుడు మనం కూడా ఒక స్త్రీనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది ఇష్టమొచ్చినట్లు పోర్న్ అని మాట్లాడేస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోండి.. మనం ఉన్న పరిశ్రమను మనమే కించపరుచుకున్న వాళ్ళమవుతాము. అనవసరంగా చెత్తను మన తలపైకి వేసుకోవద్దండి అంటూ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను కూడా మొదట్లో సినిమాల్లో నటించడానికి ఇబ్బందిపడ్డా. 
 
సినీ పరిశ్రమ అంటే అ.ఆ.ఇ.ఈ. అంటూ రకరకాలుగా నా స్నేహితులు చెప్పారు. కానీ అలాంటిది ఏమీ లేదు. నేను ఇన్ని యేళ్ళుగా ఈ పరిశ్రమలోనే ఉన్నాను కదా. అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెబుతోంది కాజల్ అగర్వాల్.