శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:29 IST)

పవన్‌ కళ్యాణ్ వైపు 80 శాతం కాపులు : మాజీ మంత్రి మాణిక్యాల రావు

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వైపు 80 శాతం మంది కాపులు ఉన్నారనీ, ఆయన వారిని ఏవిధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సి వుందన్నారు.

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వైపు 80 శాతం మంది కాపులు ఉన్నారనీ, ఆయన వారిని ఏవిధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సి వుందన్నారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్న మాణిక్యాల రావు టీడీపీ - బీజేపీల స్నేహబంధానికి బీటలు వారడంతో కేబినెట్ నుంచి వైదొలగిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, 80 మంది కాపులు పవన్ కల్యాణ్ వైపే ఉన్నారన్నారు. కాపులను పవన్ ఎలా వినియోగించుకుంటారో చూడాలని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే.. కేంద్రప్రభుత్వం నిధులు కట్ చేసి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని మాణిక్యాలరావు పేర్కొన్నారు. ముఖ్యంగా, టీడీపీ అవినీతిపై పవన్ మాట్లాడటంతో అది ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లిందన్నారు. 
 
ఇకపోతే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను పంపిందని, ఈ బృందాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు.