శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (13:15 IST)

ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో షూట్ అదిరింది.. మీరూ చూడండి

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లావస్తున్నాయి. ''ఒరు అదార్ లవ్'' సినిమాలోని ప

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లావస్తున్నాయి. ''ఒరు అదార్ లవ్'' సినిమాలోని పాటకు అమ్మడు హావభావాలు యావత్తు భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. కన్నుగీటడం, చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ ఫోటో షూట్‌తో మరోసారి యువకులను కట్టిపారేసింది. 
 
తాజాగా ప్రియా వారియర్ చేసిన ఫోటో షూట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గులాబీ రంగు డ్రెస్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఫోటో షూట్‌లో ఓ మెరుపు మెరిసింది.

ఇకపోతే.. టాలీవుడ్‌లో ప్రియా వారియర్ నటించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే ప్రియా వారియర్ బాలీవుడ్ అవకాశాన్ని కైవసం చేసుకుందని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ''టెంపర్'' హిందీ రీమేక్ ''సింబా''లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ సరసన ప్రియా వారియర్ నటించనుందని టాక్ వస్తోంది.