గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (13:43 IST)

నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది.. క్రికెటర్ షమీ భార్య

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త షమీకి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన మెసేజ్‌లను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చే

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త షమీకి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన మెసేజ్‌లను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. షమీ, అతని కుటుంబ సభ్యులు తనను రెండేళ్ల నుంచి వేధిస్తున్నారని... వారు తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.  
 
అంతేనా, షమీపై, అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు హసిన్ జహన్ సిద్ధమవుతోంది. బౌలర్ షమీకి, హసిన్ జహాన్‌కు 2014లో వివాహమైన విషయంతెల్సిందే. భార్య తాజాగా చేసిన ఆరోపణలతో షమీ వివాదంలో చిక్కున్నట్టే. 
 
ఈ ఆరోపణలపై షమీ స్పందించారు. అవన్నీ అవాస్తవాలంటూ ట్వీట్ చేశాడు. తనంటే గిట్టని వాళ్లే ఇదంతా చేస్తున్నారని షమీ చెప్పాడు. తనను దిగజార్చేందుకు, క్రికెట్‌లో కొనసాగకుండా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని షమీ ఆరోపించాడు.