సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (11:39 IST)

అనసూయ సోషల్ మీడియాకు దూరం.. జబర్దస్త్ భామకు అంత బాధెందుకు?

''జబర్దస్త్'' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై.. ఆపై వెండితెరపై మెరుస్తున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరమైంది. కానీ హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు దూరం కావడంపై సన్నిహితులు, అభిమానుల

''జబర్దస్త్'' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై.. ఆపై వెండితెరపై మెరుస్తున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరమైంది. కానీ హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు దూరం కావడంపై సన్నిహితులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంత పాపులారిటీ లభించినా.. అంతకంతకు చిన్నపాటి విషయమే చినికి చినికి గాలివానలా మారిపోతున్న సంగతి తెలిసిందే.
 
ఇటీవలే యాంకర్ అనసూయకు కూడా అలాంటి సంఘటన ఎదురైంది. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన కుర్రాడి చేతులో వున్న ఫోన్‌ను అనసూయ ఇరగ్గొట్టిందని విమర్శలొచ్చాయి. ఈ వివాదంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన అనసూయ.. సోషల్ మీడియాకు దూరమైంది. 
 
అయితే సన్నిహితులు మాత్రం సోషల్ మీడియాకు దూరం కావడం మంచిది కాదని.. ఇలా చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందని సూచించారట. ఇందుకు అనసూయ కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తానని... తర్వాత చూద్దామని చెప్పేసిందట. అయితే సినీ పండితులు మాత్రం సినీ ఫీల్డ్‌లో వుంటూ చిన్న విషయాలను లైట్‌గా తీసుకోవాలని.. ఇలా సీరియస్ కావాల్సిన అవసరం లేదని సెలవిస్తున్నారట.