సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (19:54 IST)

బహిరంగంగా ఆ తల్లి చనుబాలు ఇచ్చింది.. గృహలక్ష్మి ఫోటో వైరల్..

కేరళకు చెందిన గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్‌పేజీలో ప్రచురించిన ఫోటో ప్రస్తుతం వివాదాస్పదమైంది. తెరచాటున తన బిడ్డకు చనుబాలు ఇచ్చే మహిళలు అనేకమంది. కానీ ఓ తల్లి బిడ్డకు చనుబాలు పడుతున్న ఫోటో ప్రస్తుతం వ

కేరళకు చెందిన గృహలక్ష్మి అనే మ్యాగజైన్ కవర్‌పేజీలో ప్రచురించిన ఫోటో ప్రస్తుతం వివాదాస్పదమైంది. తెరచాటున తన బిడ్డకు చనుబాలు ఇచ్చే మహిళలు అనేకమంది. కానీ ఓ తల్లి బిడ్డకు చనుబాలు పడుతున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేరళ ప్రజలకు తల్లులు చెప్పే విషయం ఇదే. అలా చూడకండి... మా పిల్లలకు మేం పాలు ఇవ్వాలనే నినాదాన్ని అందులో ప్రింట్ చేశారు. 
 
కానీ తెరచాటున కాకుండా డైరక్ట్‌గా బ్రెస్ట్‌ఫీడింగ్ చేస్తున్న మ్యాగ్జిన్ ఫోటోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫోటోలో మోడల్ జిలూ జోసెఫ్ కనిపించింది. బహిరంగంగా తమ పిల్లలకు చనుబాలు ఇవ్వడం దేశంలో తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో.. అవగాహన పెంచేందుకు ఈ ప్రయత్నం చేశామని గృహలక్ష్మీ ఎడిటర్ తెలిపారు. 
 
నిజమైన తల్లికి బదులుగా ఓ మోడల్‌ను బ్రెస్ట్‌ఫీడింగ్ ఫోటో కోసం ఎంచుకోవడం సరికాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కానీ తల్లులు గర్వంగా.. సిగ్గుపడకుండా చనుబాలు పట్టాలన్నదే తమ అభిప్రాయమని ఎడిటర్ స్పష్టం చేశారు. 
 
పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు తల్లులు కచ్చితంగా తమ పిల్లలకు చనుబాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. కానీ చాలావరకు ప్రపంచదేశాల్లో పబ్లిక్ బ్రెస్ట్‌ఫీడింగ్ వివాదం నడుస్తోంది. సర్వేల్లో పిల్లలకు బహిరంగంగా చనుబాలు పట్టేందుకు చాలామంది మహిళలు జంకుతున్నారని కూడా తేలింది.