శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (12:32 IST)

వ్యభిచారం కేసు : టాలీవుడ్ దర్శకుడు.. ముగ్గురు మోడల్స్ అరెస్టు

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారమందింది. దీంతో ఆ ఇంట్లోకి మఫ్టీలో వెళ్లిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 
 
ఆ సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు చిత్రపరిశ్రమకు చెందినవారని తెలుస్తోంది. వీరి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. 
 
ఇదిలావుండగా, గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెల్సిందే. ఇది మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది.