సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (17:05 IST)

ఇక స్వర్గంలో నవ్వులే నవ్వులు : రాంగోపాల్ వర్మ (వీడియో)

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత నీరజ్ హోరా కన్నుమూశారు. ఆయన మృతిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంతాపం వ్యక్తం చేస్తూ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత నీరజ్ హోరా కన్నుమూశారు. ఆయన మృతిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంతాపం వ్యక్తం చేస్తూ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇదే విషయంపై ఆయన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేశాడు. 
 
"నీరజ్‌ వోరా చనిపోవడం నిజంగా బాధాకరమన్నారు. ఆయనలో ఎవ్వరినైనా నవ్వించగల హాస్య చతురత ఉందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. కానీ, అతనో బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసని గుర్తు చేశారు.
 
ముఖ్యంగా, తాను తెరకెక్కించిన "దౌడ్‌" చిత్రంలో నీరజ్‌ నటించిన ఓ సన్నివేశం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సన్నివేశంలో నీరజ్‌ నటిస్తున్నప్పుడు సెట్స్‌లో సభ్యులంతా కడుపుబ్బ నవ్వారన్నారు. దాంతో ఈ సీన్‌ కోసం నీరజ్‌ చాలా టేకులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేరు. 
 
నిజంగా ఆయన్ని మనం కోల్పోయామంటే అది స్వర్గానికి లాభం. ఇక స్వర్గంలో నవ్వులే నవ్వులు. ఖచ్చితంగా ఆయన అక్కడ దేవుళ్లను నివ్వస్తాడు అంటూ అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగ 'దౌడ్‌' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని వర్మ పోస్ట్‌ చేశారు.