బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (17:39 IST)

భూమా నాయకత్వ లక్షణాలు నన్ను ఆకర్షించాయి: పవన్ కల్యాణ్

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. భూమా మృతిపై ఆయన తన సంతాపాన్ని తెలుపుతూ ఓ సందేశాన్ని విడుదల చేశారు.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. భూమా మృతిపై ఆయన తన సంతాపాన్ని తెలుపుతూ ఓ సందేశాన్ని విడుదల చేశారు. 
 
ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)లో భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భూమా నాగిరెడ్డి మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 
 
భూమా మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు. భూమా మృతి విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారి కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు.