శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (08:56 IST)

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకునికి గాయాలు

టాలీవుడ్ - కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. ఈయన తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

టాలీవుడ్ - కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. ఈయన తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా షోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు, టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఆ వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
అయితే, ఆయన ప్రయాణిస్తున్న కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్పంగా గాయపడిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లవ్ స్టోరీస్ తీయడంలో పాపులర్ అయిన గౌతమ్‌ మీనన్‌.. తమిళంతో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో ఏ మాయచేసావే చిత్రానికి దర్శకత్వం వహించారు.