ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (09:00 IST)

పడకసుఖం కోసం వెళ్లాడు... వేశ్యను ప్రేమించిన లారీ డ్రైవర్.. ఎక్కడ?

పడకసుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమ అంతటితో ఆగక... ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. సినిమా కథను తలపించేలా జరిగిన ఈ ఘటన ఢిల్లీ మహిళా కమిషన్, పోలీసుల చేయ

పడకసుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమ అంతటితో ఆగక... ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. సినిమా కథను తలపించేలా జరిగిన ఈ ఘటన ఢిల్లీ మహిళా కమిషన్, పోలీసుల చేయూతతో సుఖాంతంకానుంది. ఢిల్లీలోని ఓ వేశ్యావాటికలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
27 ఏళ్ల మహిళ నేపాల్ నుంచి పేదరికం తట్టుకోలేక ఢిల్లీకి వలస వచ్చి ఉపాధి కోసం చూస్తూ... జీబీరోడ్డులో వ్యభిచారిణిగా మారింది. అలాగే, ఢిల్లీలో డ్రైవరుగా పనిచేస్తున్న 28 ఏళ్ల యువకుడు నగరంలోని జీబీ రోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికలోని ఓ 27 ఏళ్ల వ్యభిచారిణి వద్దకు వెళ్లాడు. అంతే తొలి కలయికలోనే ఆ మహిళంటే మనసు పారేసుకున్నాడు. దీంతోపాటు వేశ్యావాటికలోని అమ్మాయి కూడా ఈయనంటే ఎంతో ఇష్టమని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ వేశ్యావాటికకు తరచూ వెళుతూ తన ప్రేయసితో కలుస్తూ వచ్చాడు. 
 
అయితే ఆమెను ఆ వేశ్యావాటిక నుంచి విముక్తిరాలిని చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి.. ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో వారు పోలీసుల సహకారంతో ఆ వ్యభిచారిణిని వేశ్యావాటిక నుంచి విముక్తి కల్పించారు. యువకుడి తల్లిదండ్రులు కూడా ఆ మహిళతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతే ప్రేమికులిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగారు. త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకుంటారని ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు చెప్పారు.