శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (09:25 IST)

భార్యతో అక్రమసంబంధం.. అడ్డుచెప్పిన భర్తను గొంతుకోసి హత్య...

దేశరాజధాని మరో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించిన భర్తను అతి కిరాతకంగా హత్యచేశారు. కిరాయి వ్యక్తి సాయంతో గొంతుకోసిమరీ చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీ

దేశరాజధాని మరో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించిన భర్తను అతి కిరాతకంగా హత్యచేశారు. కిరాయి వ్యక్తి సాయంతో గొంతుకోసిమరీ చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నగరంలోని ఘాజీపూర్ ప్రాంతానికి చెందిన మిథిలేష్ ఓజా అనే డ్రైవరికి ఓ మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఓజా భార్యతో అదేప్రాంతానికి చెందిన నగల వ్యాపారితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఓజా డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆ నగల వ్యాపారి విజయకుమార్ ఇంటికి వచ్చిన తన కామవాంఛ తీర్చుకుని వెళ్లేవాడు. 
 
ఈ విషయాన్ని ఓజా అద్దెకు ఉండే ఇంటి యజమాని విజయకుమార్‌ గమనించి, ఓజాకు చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ఓజా భార్యను మందలించడమేకాకుండా, విజయకుమార్‌ను కలిసి ఇక ముందు తన భార్యతో అక్రమసంబంధం మానుకోవాలని తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు. 
 
అంతే ఆగ్రహం చెందిన విజయకుమార్... దుర్గాప్రసాద్ అనే కిరాయికి డబ్బులిచ్చి తన కారులో శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ లారీ నడుపుతున్న ఓజాను అడ్డుకొని గొంతుకోసి హత్యచేశాడు.
 
దీనిపై ఇతర డ్రైవర్లు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. ఓజా శవాన్ని స్వాధీనం చేసి విజయకుమార్‌తో పాటు కిరాయి హంతకుడైన దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో మృతుడి భార్య ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.