ఊపిరితో ఉండాలంటే ఢిల్లీని వీడండి : ప్రజలకు వైద్యుల వార్నింగ్

దేశరాజధాని ఢిల్లీ ప్రమాదకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ నివశించే ప్రజలను ప్రాణాలతో కాపాడాలంటే తక్షణం ఢిల్లీ నుంచి మరో చోటికి తరలించాలని వైద్యులు సూచన చేస్తున్నారు. లేదంటే ప్రాణాలకు ముప్పుతప్

pollution
pnr| Last Updated: గురువారం, 9 నవంబరు 2017 (12:49 IST)
దేశరాజధాని ఢిల్లీ ప్రమాదకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ నివశించే ప్రజలను ప్రాణాలతో కాపాడాలంటే తక్షణం ఢిల్లీ నుంచి మరో చోటికి తరలించాలని వైద్యులు సూచన చేస్తున్నారు. లేదంటే ప్రాణాలకు ముప్పుతప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా కాలుష్యాన్ని కొలిచే పరికరంలో సున్నా నుంచి 500 వరకూ రీడింగ్ ఉంటుంది. ఇందులో రీడింగ్ పర్టికులేట్ మ్యాటర్ 100 దాటితే ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినట్టు. అదే 400 దాటితే ఊపిరితిత్తులకు ప్రమాదకారకం. కానీ, రెండు రోజులనాడు 471కి వెళ్లిన ఈ రీడింగ్ ఇప్పుడు మరింతగా పెరిగి 726 స్థాయికి చేరింది. ఊపిరితిత్తులను నాశనం చేసి, శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసే పీఎం (పర్టికులేట్ మ్యాటర్) 2.5 ఢిల్లీ వాతావరణంలో ఉన్న గణాంకాలివి. యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఈ పీఎం ఉన్న గాలిని పీల్చడం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, తక్షణం ఢిల్లీని వదిలి వెళితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఢిల్లీ వాసులు ఎయిర్ ప్యూరిఫయర్లను, ఫిల్ట్రేషన్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు.

దీనిపై సర్ గంగారామ్ ఆసుపత్రి లంగ్ సర్జన్ అరవింద్ కుమార్ స్పందిస్తూ, ఇప్పుడున్న కాలుష్యం స్థాయి గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించలేదన్నారు. ఓ డాక్టరుగా, తన అభిప్రాయం ప్రకారం, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అభిప్రాయపడతున్నానని, ప్రజలను రక్షించాలంటే, వారిని ఢిల్లీ దాటించడమే ఉత్తమమని, అన్ని పాఠశాలలు, ఆఫీసులు మూసివేయాలని, రహదారులపైకి ట్రాఫిక్‌నదీనిపై మరింత చదవండి :