శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (14:08 IST)

మెంతి పొడిని పెరుగు లేదా మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

మెంతి పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో పీచు అధికం. తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇందులోని కార్బొహైడ్రేట్లు తక్కువగా వుండటం ద్వారా అధిక బరువు పెరగరు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా

మెంతి పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో పీచు అధికం. తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఇందులోని కార్బొహైడ్రేట్లు తక్కువగా వుండటం ద్వారా అధిక బరువు పెరగరు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వేడినీటిలో ఉదయం వేళ పరగడుపున తినాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుకోవచ్చు. బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచుకోవచ్చు.
 
ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. తద్వారా పొట్ట తగ్గుతుంది. మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్‌గా చేసుకుని చల్లబడిన తర్వాత తినవచ్చు. లేదంటే ఆ పొడిని గాలి చొరని డబ్బాలో నుంచి.. పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇలాచేస్తే వేడి తగ్గుతుంది. మెంతి పొడిని గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.