బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (12:20 IST)

ఆఫీసు స్నాక్స్‌ టైమ్‌లో ఉడికించిన ఓ కోడిగుడ్డును తీసుకుంటే?

ఆఫీసుల్లో గంటల పాటు కూర్చుంటూ.. బజ్జీలు, సమోసాలు వంటి స్నాక్స్ తింటున్నారా? ఇక వాటిని తినడం ఆపండి. లేకుండా ఒబిసిటీ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆఫీసుల్లో స్నాక్స్ టైమ్‌లో నూనెతో చ

ఆఫీసుల్లో గంటల పాటు కూర్చుంటూ.. బజ్జీలు, సమోసాలు వంటి స్నాక్స్ తింటున్నారా? ఇక వాటిని తినడం ఆపండి. లేకుండా ఒబిసిటీ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆఫీసుల్లో స్నాక్స్ టైమ్‌లో నూనెతో చేతిన చిరుతిండ్ల కంటే ఇవి తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే? తాజా ఫలాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని, యాపిల్, అరటి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, చెర్రీ ఫలాలు స్నాక్స్‌గా తినేందుకు ఉత్తమమైనవని చెప్తున్నారు. 
 
తాజా పండ్లలో పోషక విలువలే కాదు, సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయట. యాంటీఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడడంలో విశేషంగా సహకరిస్తాయి. ఇక నట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఆల్మండ్, ఆప్రికాట్స్, అరటి వంటివి చిరుతిళ్లుగా బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో పొటాషియమ్, ఫైబర్ అధికంగా ఉంటాయట.
 
ముఖ్యంగా, బాదంలో ఉండే ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మంచిది. బాగా ఉడికించిన కోడిగుడ్డు కూడా ఆఫీసు పని వేళల్లో తీసుకుంటే శక్తినిస్తుంది. ప్రోటీన్లు పొందేందుకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కోడిగుడ్డును ఉదయం పూట, స్నాక్ టైమ్‌లో తీసుకుంటే ఇతర చిరుతిండ్లను తీసుకోవాల్సిన పనివుండదని.. రోజుకు కావలసిన శక్తినంతా ఓ కోడిగుడ్డు ఇస్తుందని వారు చెప్తున్నారు.