శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (20:54 IST)

పిల్లలకు పాలు ఇలా ఇస్తే చాలా డేంజర్..

పిల్లల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి ఎముకలు బలంగా ఉండేందుకు, ఎదుగుదలకు పాలు చాలా ఆరోగ్యం. పాలు తాగించడం మంచిదే. కానీ ఆ పాలను ఎలా తాగాలి అన్నదే ముఖ్యం. కొంతమంది పాలును పిండిన వెంటనే పిల్లలకు ఇచ్చేస్తారు. పిండిన వెంటనే పాలును గుమ్మపాలు అంటారు. పాలు

పిల్లల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి ఎముకలు బలంగా ఉండేందుకు, ఎదుగుదలకు పాలు చాలా ఆరోగ్యం. పాలు తాగించడం మంచిదే. కానీ ఆ పాలను ఎలా తాగాలి అన్నదే ముఖ్యం. కొంతమంది పాలును పిండిన వెంటనే పిల్లలకు ఇచ్చేస్తారు. పిండిన వెంటనే పాలును గుమ్మపాలు అంటారు. పాలు పితికిన వెంటనే తాగితే ప్రమాదం. పిండిన పాలలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ పాలు తాగి పాలు పిల్లలకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రావడానికి కారణమవుతుంది. 
 
ఏ పాలనయినా బాగా వేడిచేసి గోరు వెచ్చగా అయిన తరువాత పిల్లలకు ఇవ్వాలి. పాలు అలా ఇవ్వడమే ఆరోగ్యకరం. పాలు పూర్తిగా చల్లారాక కూడా ఇవ్వకూడదు. నిల్వ ఉన్న పాలను కూడా పిల్లలకు ఇవ్వకూడదు. పాలు చిక్కగా ఉన్నప్పుడు పొయ్యి మీదే నీళ్లు పోసి ఆ తరువాత వేడి చేసి చల్లార్చి పిల్లలకు ఇవ్వాలి. పాలు వేడి చేసిన తరువాత కిందకు దించి ఇద్దామని అనుకోకూడదు. అలా చేస్తే నీళ్ళలోని బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వస్తాయి. గేదె నుంచి తీసిన పాలను పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు.