శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (18:40 IST)

ఎముకలకు బలాన్నిచ్చే మునగాకు, రాగులు.. (వీడియో)

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరాని

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి విటమిన్-డి లభించే ఆహారం కూడా తీసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగడం మంచిది. అలాగే కప్పు వేడిపాలలో టీ స్పూన్‌ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు బలపడతాయి. 
 
అంతేగాకుండా మునగ ఎముకలకు బలాన్నిస్తాయి. మునగ కాయలతో పులుసు చేసుకుని తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకుని తింటే ఎముకలు బలపడతాయి. ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలతో తాగాలి. 
 
ఇంకా గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్‌ చొప్పున కలిపి తాగడం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. కాల్షియం అధికశాతంలో ఉండే రాగుల వాడకం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. దీనిలో పీచుపదార్థాం కూడా ఉండటం ద్వారా క్యాన్సర్ దరిచేరదు. పాలకంటే రాగుల్లోనే కాల్షియం ఎక్కువ. రాగులతో పిండివంటలు, జావ, అంబలి లేదా రాగిమాల్ట్‌ తయారు చేసుకుని వారానికి రెండుసార్లైనా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.
 
ఎముకల దృఢత్వానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం కూడా అవసరమే. దీంతో ఎముకలపై ఒత్తిడి పడి వాటి లోపలి భాగానికి క్యాల్షియం చేరుకుంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వేగంగా నడవటం, పరుగు, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎంతో మేలు చేస్తాయి. ఒంటికి ఎండ తగిలినపుడు చర్మం తనకు తానుగానే విటమిన్‌ డి స్వీకరిస్తుంది. అందుచేత గంటల పాటు కూర్చోకుండా.. ఎండపడేలా పది నిమిషాలు బయట తిరగాలి.