గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:02 IST)

ఆదివారం మాంసాహారం తీసుకోకపోతే ఎంత మేలో తెలుసా?

ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది

ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది. దీంతో ఎలాంటి భగవత్కార్యాలు చేయలేం. తద్వారా అనారోగ్యాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అదే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఆ రోజు సూర్యునికి మరువకుండా అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
 
ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధంచిన స్తోత్రాలు చదివితే... ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆదివారం మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.