శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (11:45 IST)

చిన్నపిల్లల్లో కంటిజబ్బులు తొలగిపోవాలంటే..?

చిన్నపిల్లలు మొబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోండి. సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవటం వల్ల చిన్న వయస్సులోనే చిన్నపిల్లల్లో కంటి జబ్బులు తప్పట్లేదు.

చిన్నపిల్లలు మొబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారం తీసుకోండి. సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవటం వల్ల చిన్న వయస్సులోనే చిన్నపిల్లల్లో కంటి జబ్బులు తప్పట్లేదు. కంటి జబ్బులు నుంచి దూరం చేసే శక్తి కాయగూరలు, పండ్లు తినటం వల్ల లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అలాగే జామ కంటికి ఎంతో మేలు చేస్తుందని.. దీంతో నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవటం వల్ల దృష్టి లోపాలను నివారించుకోవచ్చు. జామకాయ, మెంతికూర, కొత్తిమీరలలో కంటి చూపు జబ్బులను చాలావరకు నివారించుకోవచ్చు. కారోటినాయిడ్స్ అనేవి పచ్చటి ఆకుల్లోనూ, కూరగాయాల్లోనూ, పసుపుపచ్చ కూరగాయాల్లోనూ ఉంటాయి. 
 
అందుకే పిల్లలు తీసుకునే ఆహారంలో బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు వంటివి చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.