మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:22 IST)

వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం. 1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధ

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం.
 
1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధిలో కూడా వీటిని తినకూడదు. 
 
2. మాసం లేదంటే చేపల్లో మినప పప్పు కానీ, పాలు కానీ, తేనె కానీ కలపకూడదు.
 
3. తేనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు, నీళ్లు, నూనె వీటిలో ఏ రెండుగానీ, లేదంటే అన్నీ కానీ, అలాకాకుండా సమాన నిష్పత్తిలో తీసుకోరాదు. వీటిని తీసుకున్నవెంటనే నీళ్లు కూడా తాగకూడదు. 
 
4. తీపి పాయసం, మద్యం, అన్నం కలిపి తినకూడదు.
 
5. ముల్లంగి, పెరుగు, ఎండుమాంసం, ఎండు చేపలు, పంది మాంసం, గొర్రె మాంసం, చేపలు రోజూ తీసుకోరాదు.