శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:31 IST)

గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లేంటో తెలుసా?

టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ సిరీస్‌లో భాగంగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లను బుధవారం మార్కెట్‌లోకి అందుబాటులో రానుంది.

టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ సిరీస్‌లో భాగంగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లను బుధవారం మార్కెట్‌లోకి అందుబాటులో రానుంది. 
 
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరగనున్న ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సల్ 2, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇపుడు ఈ ఫోన్లకు చెందిన ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్లకు చెందిన పలు స్పెసిఫికేషన్ల వివరాలు కూడా చూచాయగా తెలుస్తున్నాయి. 
 
గూగుల్ పిక్సల్ 2 ఫోన్‌లో 4.97 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2లో 5.99 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ 4 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా వంటి ఫీచర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక ఈ ఫోన్ల ధరల విషయానికి వస్తే పిక్సల్ 2కు చెందిన 64 జీబీ వేరియెంట్ రూ.49వేలు, పిక్సల్ ఎక్స్‌ఎల్ 2కు చెందిన 64 జీబీ వేరియెంట్ రూ.55వేలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.