శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (15:01 IST)

ఐవూమీ మి 3, మి 3ఎస్ ఫోన్ల‌ను విడుదల

ఐవూమీ తన కొత్త రకం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. 'మి 3, మి 3ఎస్' పేరిట ఐవూమీ రెండు కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.5,499, రూ.6,499 ధరగా నిర్ణయించారు.

ఐవూమీ తన కొత్త రకం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. 'మి 3, మి 3ఎస్' పేరిట ఐవూమీ రెండు కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.5,499, రూ.6,499 ధరగా నిర్ణయించారు. 
 
ఐవూమీ మి 3 ఫీచ‌ర్లను పరిశీలిస్తే... 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కలిగివుంది. 
 
ఐవూమీ మి 3ఎస్ ఫీచ‌ర్లను పరిశీలిస్తే... 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కలిగివుంది.