శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By selvi
Last Modified: శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (18:40 IST)

దేవీ నవరాత్రి 3వ రోజు... చంద్రఘంట దేవీ పూజ ఎలా చేయాలి?(వీడియో)

నవరాత్రుల్లో మూడో రోజైన సెప్టెంబర్ 23వ తేదీన సింధూర్ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున శాంతినీ, ధైర్యాన్ని ప్రసాదించే చంద్రఘంట అవతారంలో అమ్మవారిని పూజించాలి. ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరతో అలంకరిస్తారు. ఇదే రోజున గౌరీ వ్రతం కూడా చేస్తారు. భక్తులు ఈ రోజున

నవరాత్రుల్లో మూడో రోజైన సెప్టెంబర్ 23వ తేదీన సింధూర్ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున శాంతినీ, ధైర్యాన్ని ప్రసాదించే చంద్రఘంట అవతారంలో అమ్మవారిని పూజించాలి. ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరతో అలంకరిస్తారు. ఇదే రోజున గౌరీ వ్రతం కూడా చేస్తారు. భక్తులు ఈ రోజున బూడిద రంగు దుస్తులు ధరించాలి. చంద్రఘంటకు శుక్ర గ్రహం అధిపతిగా చెప్తారు.
 
అమ్మవారు పులిపై ఆశీనులై తెలుపు రంగు (చంద్రుని రంగు) దుస్తులను ధరిస్తుంది. ఈ దేవి పది చేతులు కలిగివుంటుంది. ఎడమవైపు గల నాలుగు చేతుల్లో త్రిశూలం, గద, కత్తి, కమండలం కలిగి, ఐదో చేతితో వరముద్రను కలిగివుంటుంది. అలాగే కుడివైపు గల నాలుగు చేతుల్లో తామరపువ్వు, బాణం, ధనుస్సు, జప మాలను కలిగివుంటుంది. ఐదవ చేతితో అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ దేవిని పూజిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ మాతకు మల్లెపువ్వులంటే ప్రీతి. 
 
చంద్రఘంట దేవిని...
పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా|
ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా|| అనే మంత్రంతో స్తుతించాలి.