1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Has Pawan Kalyan changed his name? Is JSP contesting for 175 seats?

పవన్ కళ్యాణ్ కాదు.. కుశాల్ బాబు... పేరు మార్చుకున్న జనసేనాని?

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పేరు మార్చుకున్నారా? అవుననే చెపుతోంది టెక్ సెర్చింజన్ గూగుల్. పవన్ కల్యాణ్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో టైప్ చేసిన ఎంటర్ బటన్ నొక్కగానే కుడిచేతివైప

Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పేరు మార్చుకున్నారా? అవుననే చెపుతోంది టెక్ సెర్చింజన్ గూగుల్. పవన్ కల్యాణ్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో టైప్ చేసిన ఎంటర్ బటన్ నొక్కగానే కుడిచేతివైపు వికీపీడియా కనిపించే దగ్గర పవన్ ఫోటోల కింద కుశాల్ బాబు అని కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
 
దీంతో పవన్ కల్యాణ్ తన పేరు ఎప్పుడు మార్చుకున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. జనసేన కార్యాలయాన్ని సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. అయితే ఈ పేరు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న సినిమాలో అతను ధరించే పాత్రపేరా? అన్నది తెలియాల్సి ఉంది. 
 
కాగా, 2019లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరు రాష్ట్రాల్లో కలిపి 175 సీట్లలో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సోమవారం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఇదే అంశంపైనే విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 
About Writer
pnr
తర్వాతి కథనం
అవకాశాలు రాలేదని దర్శకులకు వాటిని పంపిన హీరోయిన్...