గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:50 IST)

జియో కొత్త ఆఫ‌ర్‌ : రూ.96కే అన్‌లిమిటెడ్ డేటా

రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్ర‌స్తుతం రూ.309, అంత‌క‌న్నా ఎక్కువ రీఛార్జీ చేసుకున్న వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అప‌రిమిత డేటా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది.

రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్ర‌స్తుతం రూ.309, అంత‌క‌న్నా ఎక్కువ రీఛార్జీ చేసుకున్న వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అప‌రిమిత డేటా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. అయితే, ఇతర టెలికాం కంపెనీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా, ప్రీపెయిడ్‌ వినియోగ‌దారుల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకోవడం కోసం ఈ అప‌రిమిత డేటా ఆఫ‌ర్ సౌక‌ర్యాన్ని మ‌రో రెండు ప‌థ‌కాల‌కు విస్తరించింది. 
 
ఈ నిర్ణయం ఫలితంగా ఇకపై రూ.96, రూ.149తో రీఛార్జీ చేసుకున్న వారికి కూడా అన్‌లిమిటెడ్ డేటా సౌక‌ర్యాన్ని అందించ‌నున్న‌ట్లు జియో త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ రెండు రీఛార్జీ ప్లాన్ల‌లోనూ కొంత డేటా వినియోగించుకున్న త‌ర్వాత డేటా వేగం త‌గ్గుతుంది. రూ.96తో రీఛార్జీ చేసుకుంటే 7 రోజుల పాటు అప‌రిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ 4జీ డేటా వాడుకోవ‌చ్చు. 
 
కానీ 1 జీబీ ప‌రిమితి త‌ర్వాత డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌కి ప‌డిపోతుంది. అలాగే రూ.149తో రీఛార్జీ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ వరకు 4జీ వేగంతో డేటా లభిస్తుంది. 2 జీబీ వినియోగం త‌ర్వాత‌ 64 కేబీపీఎస్‌ వేగంతో డేటాను అపరిమితంగా వాడుకునే వెసులుబాటును కల్పించింది. 
 
అయితే, రూ.309, రూ.399 ప్యాకేజీలతో రీచార్జ్ చేసుకునే వారికి పేరుకు మాత్రమే అపరిమిత డేటా ప్రకటించి, డేటా స్పీడ్ దారుణంగా తగ్గించిందనే ఆరోపణలు లేకపోలేదు.