మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (06:16 IST)

24 నుంచి రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల సందడి...

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల డెలివరీ సందడి ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో బుకింగ్ చేసుకున్న వారికి 60 లక్షల ఫోన్లను అందచేయనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జ

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల డెలివరీ సందడి ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో బుకింగ్ చేసుకున్న వారికి 60 లక్షల ఫోన్లను అందచేయనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్) చానల్ పార్టనర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 
 
తక్కువ ధర కలిగిన 4జీ హ్యాండ్‌సెట్లను తొలుత గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి అందచేయనున్న సంస్థ.. ఆ తర్వాత చిన్న పట్టణాలకు చెందిన వారికి కేటాయించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉచిత ఫీచర్‌ ఫోన్ కోసం ఆగస్టు 24 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోదఫా బుకింగ్‌లు ప్రారంభించే విషయాన్ని సంస్థ స్పష్టం చేయలేదు.