గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:17 IST)

జియో 4జీ ఫీచర్ ఫోన్ డెలివరీ వాయిదా.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం?

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో సంస్థ నుంచి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే జియో ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు నిరాశ ఎదురైంది. రిలయన్స్ ప్రకటన మ

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో సంస్థ నుంచి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే జియో ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు నిరాశ ఎదురైంది. రిలయన్స్ ప్రకటన మేరకు జియో ఫోన్ల డెలివరీ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కావాల్సింది. అయితే డెలీవరీ ప్రారంభం కాలేదు. డెలివరీ తేదీని ప్రస్తుతం జియో అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. భారీ బుకింగ్స్ కారణంగా ఫోన్ల డెలివరీ తేదీ వాయిదా వేసింది. 
 
ఇకపోతే.. ఆగస్ట్ 24 నుంచి జియో ఫోన్ ప్రీబుకింగ్స్ ప్రారంభమైంది. ఈ ఫోన్లకు భారీ ఎత్తున స్పందన రావడంతో.. గంటల్లోనే ఫ్రీ-బుకింగ్స్‌ను జియో నిలిపివేసింది. అయితే భారీ ఎత్తున బుకింగ్స్ రావడంతో డెలివరీ తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. ఫోన్ల డెలివరీ తేదీని అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు జియో నుంచి మెసేజ్ వచ్చినట్లు రిటైలర్లు చెప్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది జియో ఫోన్లను బుక్ చేశారని జియో సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
18008908900 అనే కస్టమర్ కేర్ నెంబర్‌ ద్వారా జియో ఫీచర్ ఫోన్ డెలివరీ వివరాలను పొందవచ్చునని.. ఫోన్ డెలవరికీ సంబంధించి నమోదు చేసిన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ వస్తుందని జియో తెలిపింది. జియో చౌక ఫోన్ వీజీఏ కెమెరా, 2-మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2.4 ఇంచ్‌ల డిస్‌ప్లే, 512 ఎంబీ రామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎక్స్‌పాండబుల్ 128 జీబీ వరకు వుంటుంది. ఎస్డీ కార్డ్, 2వేల ఎంఎహెచ్ బ్యాటరీతో కూడిన ఈ ఫోన్ కోసం రూ.1,500లను చెల్లించాలి. ఈ మొత్తం మూడేళ్ల తర్వాత రీఫండ్ అవుతుందని జియో ప్రకటించింది.